పుట:హంసవింశతి.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxiv


వృషభఘోటకముల కంటె సైరిభమే ధన్యజీవి. దానియొడయఁడు కుంభకారుఁడు వచ్చి, “లంపులమారిదాన! నిను లాచుక మాదిగవాఁడు గోయ" (5–66) అని తిట్టుచుఁ దోలికొని పోవును. తిట్టిన నేమి! కోయఁదగినంత కండ దానిమేన నున్నది. సరిగాఁ బశువుల నట్లే తిట్టుదురు. లోకజ్ఞుఁడైన కవి వాని నెఱిఁగి యుండును.

దారిద్ర్యదోషమెట్టిదో యొక సీసమునఁ జెప్పినాఁడు (2-150). అది "శశిముఖీ దృక్పాత సంరోధి జంబీర ఫలరసం" బఁట. దరిద్రునిఁ జూచినచో ముద్దియలకుఁ గన్నులలో నిమ్మపులుసు పిండినట్లుండునేమో! ఎంత మంట!!

పర్యాయ పదములు పట్టిగట్టి ప్రదర్శించుటయందు సిద్ధహస్తుఁడగు ఈ కవి కూర్పు 1. “దాక్షిణ్య మనురక్తి దయ" (2–42) 2. "సొగసు మిటారంబు సొంపు నొయ్యారంబు" {5-86) సీసములందు; 3. “ఆకతాయి బికారి” (5-113) సీసమాలిక యందుఁ జూడనగును.

విష్ణుదాసుఁడు ఖరీదు చేసి తెచ్చిన విదేశసామగ్రి పట్టిక గ్రంథాంతమునఁ గలదు. పతి సహచరుఁడు వచ్చి, "మదవేదండ లసద్గమనతో సుధారసధారా పాండిత్య మండితోక్తులఁ బండితమండలికిఁ జెవుల పండువుగాఁగన్" (5-346) చెప్పెను. ఆపట్టిక ఆమె కొఱకుఁ గాదు. మనకొఱకు. ఆ పట్టు చూడుఁడు.

శ్రీరామభక్తుల యింటఁ బుట్టి, కృత్యారంభమునఁ బ్రహ్లాద రుక్మాంగదాది భాగవతుల స్మరించి; కృతి రామాంకితముచేసిన నారాయణ నామధేయుఁ డగు నీకవి పదునాఱవరాత్రికథలోఁ బుణ్యక్షేత్రములను మహానదులను సరస్సులను బుష్కరిణులను దీర్థములను 108 తిరుపతులను అమ్మవార్లను దర్శించి సేవించి దానధర్మములు కావించి తరించి వట్టి చేతులతోఁ దిరిగివచ్చు పోలిసెట్టి కొడుకు హిరణ్యకుఁడు (బంగారు సెట్టి) వానకుఁ దడిసి, తలదాఁచుకొనఁ బోయి, బెస్త చెలియతో “వివాహ హీనుఁడన్", "ఆలికే నంగలార్చుచు నన్యసతులఁజూచి గ్రుక్కిళ్లు మ్రింగుచు సుఖములేని కతన యాత్రఁ జరించెడి కతయె కాని, మనసు సంభోగవాంఛల మరగి తిరుగు" (4-229) అని పలుకులాగునఁ గథతీర్చుట, అంగరసము అంగిరసమును మ్రింగివేయకుండ జాగరూకత వహించుటయే యని