ఈ పుట ఆమోదించబడ్డది
52
సౌగంధిక ప్రసవాపహరణము
సలలితబహువిధజంతుసంతతులు
కమనీయబహువనకై రవకమల
కమలసంపూరితకమలాకరముల
రాజిల్లు రాజమరాళ సంఘముల
నోజతోడుతఁ జేరి యొక్కొక్క యొడల
కిలకొట్టుచును జలక్రీడ లేవేళ
సలుపుచు మెలఁగు నచ్చరపూవుఁబోండ్లు
కన్నులపండువుగాఁ జూచి భ్రమసి
కన్నన విలుకానికయ్యంబునకును
తమకించి బొదలు గంధర్వ శేఖరులు
కమలకాండాసక్త కమలాకరములఁ
గడునోర పౌరులు గలుగక యుండ
నడుపులు నేర్పు కిన్నరరాజముఖులు
నలువొంద రంభాదినలినలోచనలు
సలలితనాట్యప్రసంగ వైఖరులఁ
జెలుపురంజిల్లుమై సిరిపొంకములును
బొలుపొందు నభినయంబులసోయగములు
కొలఁదికిమీరినకోపుచాలులును