పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/96

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము


బెళుకులు దళుకులు పేరిణి విధము
లొనరంగ వీక్షించి యుల్లము ల్చెదరి
యనయంబు మోహించుయక్షవల్లభులు
సొరిది నన్నియుఁ జూచి చూడని యట్ల
వెర వొప్పఁగా విని విననిమార్గముల

పరమేశ్వరుని మనఃపద్మంబునందు
నిరవొందఁగా నిల్పి యీషణత్రయము
హరియించి యెపుడు బ్రహ్మధ్యాను లగుచు
ధరతపంబులు సేయు తాపసోత్తములు
మరి పెక్కుఁగలచిత్రమహిమలు గలిగి

పరువడి విలసిల్లు బదరికావనము
ఆవనమధ్యంబునందు నత్యంత
పావనంబై భవభయహరం బగుచు
గరుడగఁ ధర్వరాక్షసయక్షుఖచర
సురకిన్నరమనీంద్ర శోభితం బగుచు

ధర నెన్న మోక్షప్రదాయకం బగుచు
గరిమచే వెలయు గంగాతీరమునను