పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

రాయలపక్షముననుండి సమరరంగమున గజపతి దళములతోఁ బోరాడినవిధము ఈక్రిందివిధమునఁ గవి వర్ణించెను.

ఉ. రీనిగ నౌ కువారును గడిందిరహిన్ వెలుగోటివారలో
     రావెలవారుఁ గూడుకొని రాత్రి పగల్ చతురంగసేనతో
     నేనగఁ జూచినన్ తెలియనెంతయు శక్యముగాని దుర్గమా
     భూవరమౌళి గాంచి యొకపూలునె గీసెద నంచు నుగ్రుఁడై (3-59)

విశ్వనాథనాయనిస్థానాధిపతి వ్రాసిన రాయవాచకములో గమ్మనాయకుల ప్రస్తావన గలదు (పుటలు 65,84).

సౌగంధికప్రసవాపహరణమునందు కవి వర్ణించిన విషయములు గొన్ని విజయనగరసామ్రాజ్య మేలిన సాళువ తుళువ ఆర్వీటువంశనృపాలురు కృతులందిన ఆంధ్రకావ్యములందును వర్ణితము లయ్యెను. లింగభూపాలుని మూలపురుషుఁ డగు మల్లభూపతి గుడిపాటి సమీపమున కుతుబుషాహి బలముల నెదుర్కొని యోడించి రాయలచే