పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పై రెండుగ్రంథములు నముద్రితములు. భాషో

ద్ధారకులు ముద్రింతురుగాక.

గ్రంథ ప్రాశస్త్యము

కృతికర్త యగు రావిళ్ల లింగభూపాలుఁడు

కమ్మకులతిలకుఁడు. వెల్లుట్లగోత్రసంజాతుఁడు. ఈ
లింగభూపాలుఁడును, ఇతని తండ్రి తాతలును,
విజయనగరసామ్రాజ్య మేలిన సాళువ, తుళువ,
ఆర్వీటి వంశనరపతుల సామంతులుగ నుండి, గజ
పతులతోడను, అశ్వపతులతోడను, వారొనర్చిన
సంగ్రామములయందు సహాయులై, విజయములఁ
జేకూర్చుచుండిరి బాహుబలదర్ప శౌర్యసంపన్ను
లగు ఈకమ్మసామంతనాయకుల యుదంతము
తత్కులమువారే గాక అఖిలాంధ్రలోకమును
బ్రశంసింపదగినది.

కుమారధూర్జటి కృష్ణరాయవిజయమునం

దీరావెలవారినిగూర్చి ప్రశంసించెను. రాయలు
కళింగ దిగ్విజయయాత్ర వెడలినప్పుడు తోడ్పడిన
వీరనికాయములో రావెలవంశీయులు గలరు. వీరు..