పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

13

విరివిగా పదియారువేలపత్రముల
నలరుచు నుండెడి నారుపద్మములఁ 200
జెలువొంద పవనునిచే మేలుకొలిపి
నాభిపద్మంబు క్రిందట ముమ్మూల
శోభిల్లు బాహ్యాండ సురుచిరంబైన
గంభీరనాభికా కాండంబులోన
గుంభించి యనిలుగొని దానిచేత 205
నాధారకమలమధ్య త్రికోణాంత
రాధీనరేభాంత రాక్షరానలము
వెలుగించి వాయువు వెస నందు నిలిపి
పొలుపొంద నెనిమిది ముఖములక్రిందఁ
దనరు పశ్చిమనాడి తలక్రిందుజుట్టి 210
పెనుఁబాము బలునోరు వెడలంగఁ జేసి
నలుపుగా పశ్చిమనాడిలో నునిచి
వెలయు వేట్క లనేకవింశతిమణులఁ
బెనఁగొని సంతాపభేద్యమై యలరి [1]
వనజాసనేశ విష్వక్సేననామ 215

  1. బెనగొని సంతతాభేద్యమై యలరి (క)