పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

సౌగంధిక ప్రసవాపహరణము

ధరణి నీతియు రిపుత్రాటకం బనఁగ
నలరు షట్కంబు లాచరింపుచును
సలలితోడ్డేయాణ జలాంధరములు [1]
మొదలైన దశవిధంబులముద్ర లెలమి
గదియించి యిడయు పింగళ సుషుమ్న
మణిపూరకాది థామములు పదునాల్గు
లోపల నున్న నాడులు వివేకించి
శీతలాభ్ర మరిభస్త్రికమూధ్న కేవ
లాతతరవి భేదనాదినామముల
గలయష్ట విధకుంభకము లేర్పరించి
కలకివలపు గుంభకముల గుంభించి [2]
లీలతో నాసనలింగహృన్నాభి
తాలుమూలలలాటతటములయందు
నాధారమణిపూరకాదినామముల
సాధారణంబులై సరస వర్ణింప
పరుపడి నాల్గారు పది పది రెండు

  1. సలిలతోడ్డీయాణ జాలాంతరములు (క)
  2. కలకేవలపు గుంభకముల గుంభించి (క)