పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

సౌగంధిక ప్రసవాపహరణము

రమణీయకావ్యము రచియింపఁ దలఁచి
విమలచిత్తమున భావించుచుండఁగను

కృతిపతివర్ణనము


తనకీర్తిసకల బాంధవమిత్రసుకవి
జనచకోరములకు చంద్రికగాఁగ
తనప్రతాపఫ్రౌఢి దర్సితారాతి
వనసంతతికి దవవహ్నియుఁ గాఁగ
తనదయ శరణాగతవిరోధితతికి
ఘనతరం బగువజ్రకవచంబు గాఁగ
తననిశాతక రాసి ధారవిరోధి
మనుజేంద్ర దేవతామత్త కాసినులఁ
దొలఁగక బొందించు దూతిక గాఁగ
కలిత శృంగార వైఖరులఁ జెన్నొందు
తన మహోన్నతనవ్యధామంబు భాగ్య
వనజమందిరకు నివాసంబు గాఁగ
జననాథు లెన్న విశ్వంభర వెలసె
ఘనుఁడు రావిళ్ల లింగమహీశ్వరుండు
కసికాగ్రగణ్యుండు రావిళ్లలింగ