పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

9

సంగతపటుహృదంచితచంచరిక
భట్టరు శ్రీ చన్న భట్టరాచార్యు[1]
పట్టభద్రులపాదపద్మములు దలఁచి 135
నరయశోధనులు గీర్వాణాంధ్ర కవుల
నిరతంబు గణుతించి నేర్పు వహించి
చాటు వాక్ప్రౌడలక్ష్మణలక్ష్యశబ్ద
నాట కాలంకార నవ్యప్రబంధ
సారార్థసంగ్రహ సర్వజ్ఞ మూర్తి 140
కారుణ్యసుకవి ముంగరశానసుకవిక[2]
చంద్రు చారిత్రము ల్జననాథ సభల
సాంద్ర మతిస్ఫూర్తి సన్నుతిఁ జేసి
బహువిధాలంకారపదగుంభనములు
మహితశయ్యాపాకమార్గ వైఖరుల 145
నవరసనాయకనాయకీభావ
వివిధలక్షణముల విలసిల్లు నొక్క

  1. సంగరహృదయాబ్జ సచ్చంచరీక భట్టరు శ్రీచెన్నభట్టరాచార్యు (6)
  2. కారుణ్యసుకవి ముంగరశాససుకవి(క)