పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

427



పునుకపాత్రయు బెద్ధవులితోలు కాశ
మినుకులుగలగాలిమేనితలసొమ్ము1510
పూని ధరించిన పురియలపిండు
ఏనుఁగుచర్మము హెయ్యంపుపటము
జడలు మెండుగఁ దాల్చి జడియక రేలు
బడుగు కల్లరికాటి పాపనిలీల
భూతిమై పూసి యాఁబోతునెక్కి1515
జాతిమాలిన వేషభాషలు నేర్చి
దయ్యాలరాజపై తగ కాడు గాచి
యయ్యెడ నుండక ననికి రాఁ దగునె!
పోడిమి ఘనులతోఁ బోరాడుటెల్ల
వేడుక కుడుముల వేట్లాటగాదు1520
పొమ్ము శ్రీకైలాసభూధరంబునకు
నిమ్మహాశరముల నీల్గఁగావలదు;
అని యార్చి యేసిన నతిభీకరముగఁ
జనుశిలీముఖముల శంభుడు గాంచి
ప్రతిబాణముల నని భంజించి వైచి1525
యతులసాయకముల నతని నొప్పించి