పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌగంధిక ప్రసవాపహరణము

428



కనలి యంతటఁ బోక కందర్పవైరి
దనుజనాథుని మాయ దలగింతు ననుచు
నలునొంద వాయు బాణంబు సంధించి
వలనొప్ప మంత్రపూర్వకముగా వైచె1530
అది రెండు నాలు గైదారును నగుచుఁ
బదియు నల్వదియు నర్వది నూరు నగుచుఁ
గడు నేఁగి వేలు లక్షలు గోటు లగుచుఁ
దడయకఁ జని యర్బుదంబులు నగుచు
ఘనఖర్వములు మహాఖర్వము లగుచుఁ
జని శంఖములు మహాశంఖము లగుచు
బహుపద్మములు మహాపద్మము లగుచు
మహి ననంతానంత మహిమల నేఁగి
దనుజాధినాథునిఁ దద్బలంబులను
దనరు తేజంబులఁ దాఁకె; తాఁకుటయుఁ
బరువడి సురరాజుపై దండు గదలు
గురుతైన కాటుకకొండలో యనఁగ
తిరమొంద మదనుండు దివిజులమీఁదఁ
బరఫు నీలోత్పల బాణంబు లనఁగ