పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

421


వినువీధి దానవవీరులతోడ
ఘనఘనాకారముల్ గైకొని నిలిచి
పట్టుగాదశదిశాభాగంబునందు
దట్టంపుచీకటుల్ దార్కొన మించి
మినుకైన యడిదంపు మించుట మించి1410
యొనరనార్భటులును నురుములు నురిమి
పురుహూతుపాపంబు; బోలినయట్టి
వరశరాసనము చెల్వమునఁ జేపట్టి
కరకరినావర్త కాలమేఘములు
వరుస కుంభద్రోణవర్షము ల్గాఁగ 1415
గురియుచందంబున ఘోరతరోగ్ర
శరవర్షములు ముంచి చలము రెట్టించి
పిడుగులవానలు బెడిదంపు వారి
యడిదంపువానలు నద్రులవాన
లురుతరభీతి నాయుధములవాన 1420
లరిమురి గురియించి యధికుఁడై మించి
యొకచోట హసియించు నొకచోటఁ గేరు
నొకచెంత గర్జించు నొకట గద్దించు