పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

422

సౌగంధిక ప్రసవాపహరణము



నొకక్రేవఁ బలు రొప్పు నొకదిక్కు నార్చు
నొకటెంకి నదలించు నొకపజ్ఞఁ గదుము 1425
పేరుపేరులబిల్చు పేరెముల్బారు
భోరుభోరునదూరు భుజములు సరచు
మసలి వర్తిలు పెక్కుమాయలు పన్ను,
కసివోక మరియు రాక్షసకులేశ్వరుఁడు
బలిమి కిన్నరయక్షప్రమథసైన్యములఁ1430
బొలియించి వెస నొక్క ప్రోవు గావించి
మేటియోధలనెల్ల మేదినిఁగూల్చి
దీటైనరథికులఁ దెంపునఁ జంపి
తక్కిన దొరుల యోధలరథోత్తముల
పెక్కు మార్గణముల భేదించుటయును;1435
కరులేఁగె హయములు గదలె కాల్బలము
పరువెత్తె రధికులు పారిరిదిశల
తరుచుగా నున్న వేదండగాత్రముల
మరుగుల నడఁగిరి మానంతకులము
హయకళేబరముల నటునిటుఁ ద్రోచి1440
రయమున దూరిరి రాహు త్తతతులు