పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌగంధిక ప్రసవాపహరణము

413


నరిది పరాకుసేయక నన్నుఁ జూడు[1]
నిఖిలమునిస్తుత్య నిగమాంత వేద్య !
అఖిలాండకోటి బ్రహ్మాండకుటుంబ
వైకుంఠ నిలయ ! గోవర్ధనోద్ధార !
శ్రీకరగుణమూర్తి ! చిన్మయమూర్తి !1275

దానవకులశిక్ష ! ధవళాంబుజాక్ష!
మానితగుణజాల! మదనగోపాల!
అప్పుడు మిమ్ము నే నాడినయట్టి
తప్పులు మన్నించి దయబ్రోవు నన్ను
పన్నుగా సుతుఁ డెన్ని పలికినఁగాని1280

కన్నతండ్రికి ముద్దు గాదె శ్రీకృష్ణ
నావిని నవ్వి దానవకులాంతకుఁడు
వేవేగ గర్ణుని వీక్షించి పలికె
మాయురె! మేల్మేలు! మార్తాండతనయ
నీయెడ నాయెడ నేరము ల్గలవె 1285
నీనేమి నేనేమి నెనరైన మేన

  1. పరవసేయక నన్ను పాటించి చూడు(ట).