పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

414

సౌగంధిక ప్రసవాపహరణము



బావవు తగువైన బంధుండ వీవె
పెద్దపు వరుసను బిన్నను నేను
తద్దయుఁ దండింప ధర్మము గాదె;
పాయక నేకమై బహునాళ్లనుంచి
మాయయ్య నేనును మెలఁగినవాఁడ;[1]
తగవు లెంచక నిన్ను తప్పు లేన్నుదునె
యింక నే నొక్కటి యెంచెద వినుము
శంకరుతో నీవు సమరంబు సేయ
సన్నుతి కెక్కిన సాహసు లచట
నున్నారు తగదయ్య యొంటిగా నేగ
బలభద్ర సాత్యకి ప్రముఖులతోడ
బలువిడి నేతెంచి బవరంబు సేయు

  1. మీయయ్యలోననే మెలఁగినవాఁడ
    పాయని యన్యోన్య బాంధవద్వేష
    లైయున్న కుముదకంజాప్తుల మెపుడు
    గడురెండు రెండును గన్నులుగాఁగ
    నెడపక వీక్షించి నేకంబుసేతు
    తగ నిన్న నేటి బాంధవ్యంబె మనకు (త)