పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

శాసనములందలి రావెళ్లవారిచరిత్ర

నెల్లూరిజిల్లా శాసనసంపుటములనుండి రావెల వంశీయులగు మఱికొందఱు కమ్మనాయకులచరిత్ర తెలియవచ్చుచున్నది. రాజరాజదేవుని పండ్రెండవ పరిపాలనసంవత్సరమునం దొక రావిళ్ల నాయకుని ప్రస్తావన గలదు. ఇదియె రావిళ్లవారినిగూర్చి చెప్పెడి యత్యంతమైన ప్రాచీనశాసనమును, బ్రథమశాసనమునై యున్నది. [1]వీరిలోఁ గొందఱు నెల్లూరు జిల్లాలో నుదయగిరి, పొదిలి, కొచ్చెర్లకోట సీమలఁ బాలించుచుండిన సామంతనాయకులు గలరు. వీరును వెల్లుట్లగోత్రులే. పొదిలి సీమను బరిపాలించిన రావెల తిప్పానాయకుఁడును, ఉదయగిరిసీమను బాలించిన రావెల కోనేటి చినతిమ్మానాయకుఁడును ముఖ్యులు. సౌగంధికప్రసవాపహరణములోని రావెలవంశీయులకును, శాసనములందలి రావెలవారికిని బరస్పరసంబంధము వీరివంశావళినిబట్టి నిర్ణయించుట దుర్ఘట

  1. B. V. Nellore Inscriptions. S (6)