పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

క్రీ. శ. 1640 తర్వాత నీప్రాంతమంతయు గోలకొండ నవాబు వశమయ్యెను. (నెల్లూరు జిల్లా) ఇప్పటి అనంతపురము, చెంగల్పట్టు, కడప, తిన్నవిళ్లి, మైసూరుప్రాంతములు వేంకటపతిరాయలపరిపాలనక్రిందనే యుండెను.

లింగభూపతి “డాబాలుపై బడి డాగులుచేసె నని” కవి వర్ణించెను. ఈడబాలు అనునది పశ్చిమతీరముననున్న డాబుల్ (Debul)పట్టణ మేమో యని సందేహము గలుగుచున్నది. ఆకాలమున ఆపట్టణము పోర్చుగీసువారివశమున నుండెను. ఆ పట్టణముపై దండువెడలుటకును, పోర్చుగీసువారికిని, విజయనగరసామ్రాజ్యాధీశులకును బోరాట మేల సంభవించెనో తెలియదు. ఈవిషయము పరిశీలింపదగినది.