పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

సౌగంధిక ప్రసవాపహరణము



తుదిమొద లెఱుఁగక తూలనాడెదవు !
మునుపు నే నీప్రాయమునఁ జేసినట్టి
పనులెల్ల శ్రీరామచంద్రుఁడే యెఱుఁగు;
నలవడ నాదిత్యు నైన మ్రింగుదును
నలఘుశక్తిపయోధు లైన దాఁటుదును 1840
పెనుమహీజము లైన వెల్లగించుదును
ననువంద బలుగిరు లైన నెత్తుదును
ఈసున నిపు డైన నేమి యింకొక్క
దాసరితోపాటు తలపడగలను
అచ్చుగాముకు పచ్చలారవు బిరుదు [1] 1845
పిచ్చుకతో సరి బెనఁగఁ జూచెదవు
చెనకగూడనివారి చెనకి యావెనుక
తినుక నేటికి లేనిధీమనం బేల
మగఁటిమి గలిగిన మగవాఁడ వైన
తెగువతో నాపండు దెచ్చి నాకిమ్ము; 1850
గరిమ నీపని చేత గాకుండెనేని

  1. అచ్చుగాముకు పచ్చలారవు పనులు. (ట)
    2. అచ్ఛుకతో భేరి నదలించవచ్చు. (మ)