పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

169



దొరవలె వచ్చిన త్రోవనే జనుము;
అనిన నత్యుగ్రుఁడై యాపాండురాజ
తనయుఁ డిట్లనిపల్కె తరుచరేశ్వరుని
వనచరాధమ! ముదివాఁడవై యున్న 1855
ఘన మెఱుంగక పెక్కు కారు లాడెదవు
ముందె వానరుఁడవు, ముదిమికిఁ దోడు
కుందేటివెఱ్ఱి నెక్కొనె మేలు మేలు !
ములుచవానర వేదముండకోపంబు
తిలకింప పెదవులతీటమాత్రంబె [1] 1860
పాటించి నోటికి బగసికఁ దగిన[2]
మాటలాడెద వెంత మడియఁడ వీవు[3]
వరుసఁగూర్చుండి లేవగ లేవు గాని

  1. దీనికితర్వాత నొకప్రతిలో నీపంక్తులుకలవు.
    కడుబలశౌర్యముల్ గలవు నీయందు
    వెడగ నీమోముఁ జూడఁగఁగానవచ్చు.
  2. పాటించి నోటికి బరిపాటిదగిన (త)
  3. మాటలాడవు యెంత మడియవు నీవు (ప)