పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

159పనుపడ నే నిందు బడియున్న తెఱఁగు
వినుపింతు విన వన్న విశదంబుగాను[1] 1700

నీవిధంబునను నే నిబిడాటవులకు
కావరంబుస నొంటిగాఁ జనుదెంచి
మినుకైనఫలములు నొక్కుచు వేడ్క
వన మెల్ల వెదకుచు వచ్చి యామ్రాను
పరికించి యందొక్కఫలము నీక్షించి 1705

యరుదైన ఫల మౌట యాస వాటిల్లి
యరుగక యీతరు వెక్కఁగా బోయి
వరబల్మి చెడిపోయి వ్రాలి యున్నాడ
ముదిమి పైకొని నేత్రములు చూపు దరిగె
పదపడి యీపండు పడిన భక్షింతు1710
ననిన శతాబ్దంబు లయ్యె నీవరకు
మనుజేశ యీమహామాయాఫలంబు
పడినది లేదాయె ఫలముపై నాస

  1. వదరుచు నే నిందు బడి యున్న తెఱఁగు
    విదితంబుగా నేను విన్నవించెదను (ట,ప)