పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

సౌగంధిక ప్రసవాపహరణము


విడిచిపోయెదనన్న వెసకాళ్లు రావు
కోరుచుండఁగఁ బిచ్చుగుంటపై ఘనము 1715
జారుభాగీరథిఁ జనుదెంచు లీల[1]
వచ్చితి వీవు నావయసు ని న్నడుగ
వచ్చంబులేని సత్వంబు ని న్నడుగ
మానవాథీశ! యొక్కటే పండు
యీమ్రాన నున్నది యీక్షింపు మయ్య 1720
అనఘాత్మ! పాండవు లార్తరక్షకులు
ననుచుఁ బల్కఁగ విని యడిగెద నిన్ను
యీపండు సాధించి యిచ్చితివేని
పేపనులైన వయ్యెడిని నీచేత

  1. కోరుచుండఁగ పిచ్చుగుంటుయంగమున
    చారుభాగీరథి చనుదెంచులీల
    తలఁప శక్యముగాని దారిద్రునకును
    నలువొంద పెన్నిథానం బబ్బినటుల
    నిచ్చలో నాడబోయినతీర్థ మెదురు
    వచ్చి నిల్చినమాట్కి వచ్చితి నీవు (త)
    (b) కోరుచుండగ పిచ్చుకుంటపై వేగ. (చ)