పుట:సులక్షణసారము (లింగమకుంట తిమ్మన).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. జగణస్య

వాదాంగచూడామణి—


చ.

రవి యధిదైవ మాదివసరాట్కులమున్, గురువిందకాంతియున్
రవిగ్రహ మెన్నఁగా నతఁడు రక్తపువర్ణము సింహరాశి ను
ద్భవమగు, రోగమాఫలము, తారకయుత్తర, ధేనుయోని, మా
నవగణమున్ దలంప జగణంబునకున్ ద్రిదశేంద్రవందితా!

97[1]


కవిసర్పగారుడే—


మ.

అరుణుం డేలిక చాయ రక్తిమ రసంబా వీర మాయన్వయం
బురువై రాజ్యము రాశి సింహము గ్రహం బుష్ణాంశు వత్తార యు
త్తర రోగంబు ఫలంబు యోనియిరవొందం ధేను వమ్మానవం
బరుదారంగ గణంబునా జగణ మింపారున్ జగత్సిద్ధమై.

98[2]


వ.

అధిదైవత సూర్యుఁడు, క్షత్రియకులం, రక్తవర్ణం, గ్రహాది సూర్య ఏవ, సోపి రక్తవర్ణః, సింహరాశి, ఫలంరోగం, ఉత్తరానక్షత్రం, ధేనుయోని, మనుష్యగణం, వీరరసం, భార్గవగోత్రం జననం శ్రీరామనామ యానం, షట్సంజ్ఞా.

99


ఆదిప్రయోగసరణి:


చమత్కారచంద్రికాయాం—


రుజాకరో మధ్యగురర్జగణో భానుదైవతః.

100[3]


సాహిత్యరత్నాకరే—


మధ్యే గురుర్జోరుజః

101[4]
  1. ఆ.రం.ఛం. అ 2 సం 71
  2. ఆ.రం.ఛం. అ 2 ప 72. సు.సా. ప 225
  3. ఆ.రం.ఛం. అ 2 ప 73
  4. ఆ.రం.ఛం. అ 1 ప 74