పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

33


స్థుఁడు అగుచున్ = ప్రసిద్ధిఁచెందుచు, అతిసౌఖ్యంబు = అధికమగునానందము, (లేక; మోక్షసుఖము,) ఒప్పన్ = కలుగునట్లుగా, దివ్యాధ్యాత్మయోగంబున్ = ఉత్తమ మగుజీవబ్రహ్మైక్యమును, (లేక దానికి సాధనఁమగు రాజయోగమును,) సంగ్రహించెన్ = తెలిసికొనెను.

తా. శ్రీకృష్ణమూర్తి సాందీపని సేవించి అఱువదినాలుగు విద్యలను గ్రహించినట్లు బ్రహ్మవేత్తయగు మహాదేవుండను గురువరుండు మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము మొదలగు సమస్తసద్గుణములకు నిధియైన యాకోనేరుగురువు నాశ్రయించి జీవబ్రహ్మైక్యమును దెలిసికొనుటకు ముఖ్యసాధన (సుఖసాధన) మగురాజయోగమును గ్రహించి బ్రహ్మానందమును గైకొనియెను.

చతుష్షష్టికలావివరణము.

అఱువదినాలుగు విద్యలు:- శ్లో. ఇతిహాసాగమౌ చైవ కావ్యాలంకారనాటకమ్, గాయకత్వం కవిత్వం చ కామశాస్త్రం దురోదరం దేశభాషాలిపిజ్ఞానం లిపికర్మచవాచకం, సర్వాణి చావధానాని స్వరశాస్త్రం చ శాకునం, సాముద్రికం రత్నశాస్త్రం రథాశ్వగజకౌశలం, మల్లశాస్త్రం సూదకర్మ భూరుహాణాం చ దోహదం, గంధనాదో ధాతునాదః ఖనివాదో రసస్యచ, జాలవాదోగ్నిసం స్తంభో ఖడ్గస్తంభో జలస్య చ వాచస్తంభో (?) వశ్యాకర్షణమోహనం, విద్వేషణోచ్చాటనం చ మారణం కాలవంచనం, పరకాయప్రవేశశ్చ పాదుకాసిద్ధి రేవ చ, వాక్సిద్ధి ర్ఘుటికా సిద్ధిరైంద్రజాలిక మేవచ, అంజనం పరదృష్టే స్తు వంచనం స్వరవంచనం, మణిమంత్రౌషధీనాం సిద్ధయ శ్చోరకర్మ చ, చిత్రలోహాశ్మమృద్దారువేణు చర్మాంబర క్రియాః, అదృశ్యకరణం దండకరణం మృగయానిధిః, వాణిజ్యం పాశుపాల్యం చ కృషి రాననకర్మచ, లాదకుక్కుటమేషాదియుద్ధకారకకౌశలం, చతుష్షష్టికలా స్త్వేతాః కలావిద్భిః ప్రకీర్తితాః.

చతుర్దశవిద్యలు

పదునాలుగువిద్యలు:- శ్లో. 'అంగాని వేదా శ్చత్వారో మీమాంసాన్యా యవిస్తరః, పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హ్యేతా శ్చతుర్దశ.'

అష్టాదశవిద్యలు

పదునెనిమిది విద్యలు:-శ్లో. ఆయుర్వేదో ధనుర్వేదో నీతిశాస్త్రార్థశాస్త్రయోః, వేదాం గాని చ వేదాని మీమాంసా న్యాయవిస్తరః ధర్మశాస్త్ర పురాణం చ విద్యా హ్యష్టాదశా యితి.

సీ. అఖిలభూతంబుల నాడించుమాయను
             సొంపుగా నెవ్వఁ డాడింపుచుండు