పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

శ్రీ సీతారామాంజనేయసంవాదము


చండ ఏకశివ అనంత అజ ఉమాపతి ప్రచండ ఏకపాద ఈశాన భవ ఉగ్ర భీమ అనంతసూక్ష్మ శివోత్తమ ఏకనేత్రి ఏకరుద్ర త్రిమూర్తి శ్రీకంఠ శిఖండి వామజేష్ఠరాద్రి కాళ కలవికర్ణ బలవికర్ణ బలప్రమధన సర్వభూతదమన మనోన్మని అనాశ్రిత అనాధున అనంత వ్యోమరూపవ్యాపిని ఊర్ధ్వగామిని రోచిద మోచిక దీపిక ఇందిర శాంత్యతీతశాంతి విద్యాప్రతిష్ఠనివృత్తి అని భువనములు ఇన్నూటయిరువదినాలుగు.

కళాధ్వము:- నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీతమని కళలు ఐదు. ఈ పంచకళలలో మంత్ర పద వర్ణ తత్త్వభువనములును, ఈతత్త్వములలో భువనములు చేరియున్నవి. వీనివిశేషవివరణము కైవల్యనవనీత ప్రధమప్రకరణమున అఱువదియొకపద్యమునం జూడవలెను.

మఱియు సర్వసమయమంత్రములును సప్తకోటిభేదములు కలవై ఉండఁగా, మంత్రాధ్వమందు పదునొకండు మంత్రములు మాత్రము చెప్పుటకు హేతువేమనిన: పరమశివుని పంచముఖములయందే సకలాగమమంత్రములును పుట్టుటచేత సద్యోజాతాదిపంచమంత్రములును ఆమంత్రములకు ముఖ్యములయిన షడంగదేవతామంత్రములును చేరి పదునొకండుమంత్రములని చెప్పఁబడెను.

మఱియు — శ్లో. 'మకారం మననందైవ త్రకారంత్రాణముచ్యతే, మననత్రాణ మిత్యాహు ర్మంత్ర మిత్యభిధీయతే.' అనున్యాయముచేత పరబ్రహ్మము మననమునకును రక్షణమునకును విలక్షణమగుటవలన మంత్రాధ్వాతీతమును సర్వదేశవ్యాపకత్వము గలుగుటవలన పదాధ్వాతీతమును అవర్ణమగుటవలన వర్ణాధ్వాతీతమును సర్వతత్త్వవిలక్షణమగుటవలన తత్వాధ్వాతీతమును సర్వస్వామి యగుటవలన భువనాధ్వాతీతమును నిష్కళ మగుటవలన కళాధ్వాతీతమును అగును.

శా. ఆకోనేరుగురూత్తముం గొలిచి దివ్యాధ్యాత్మయోగంబు దా
    శ్రీకల్యాణగుణప్రసిద్ధుఁ డగుచున్ శ్రీమన్మహాదేవలో
    కై కాచార్యుఁడు సంగ్రహించె నతిసౌఖ్యం బొప్ప సాందీపనిన్
    శ్రీకృష్ణుండు భజించి విద్య నొనరం జేకొన్న చందంబునన్. 31

టీక. శ్రీకృష్ణుండు, సాందీపనిన్ = సాందీపనియను గురువును, భజించి = సేవించి, విద్యలు = అఱువదినాలుగువిద్యలను, ఒనరన్ = ఒప్పునట్లుగా, చేకొన్నచందంబునన్ = గ్రహించిన విధమున, శ్రీమన్మహాదేవలోకైకాచార్యుడు = బ్రహ్మవేత్త యగుమహాదేవుఁ డను లోకగురువు, ఆకోనేరుగురూత్తమున్ = ఆకోనేరుగురుశ్రేష్ఠుని, కొలిచి = సేవించి, తాన్ = తాను, శ్రీ... ప్రసిద్ధుఁడు- శ్రీ = మోక్షసమృద్ధి గల, కళ్యాణగుణ = శాంతి, ఇంద్రియనిగ్రహము మొదలగు సద్గుణములతో, ప్రసి