పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

శ్రీ సీతారామాంజనేయసంవాదము

     నామరూపావ్యయవిలక్షణంబు లాత్మ
     నెఱిఁగినకవీశ్వరుండె కవీశ్వరుండు 10

టీక. మహిత. . ,ములు - మహిత = ఒప్పుచున్న (లేక, గౌరవార్హము లైన), గురు= గురువులను, లఘు = లఘువులైనట్టియు, వర్ణ - అక్షరముల యొక్క (“దీర్ఘస్సంయుక్తాద్యః పూర్ణానుస్వారపూర్వవర్ణశ్చ" దీర్ఘమును, విసర్గలున్న యక్షరమును, సంయుక్తాక్షరమునకును, బూర్ణానుస్వారమునకును ముందున్నయక్షరమును గురువు లనఁబడును. మిగిలినవి లఘువులు. ), ధర్మములు = స్థితులును, నియమములు = యతిప్రాసనియమములును, కలిత... క్రియలను - కలిత = ఒప్పుచున్న, కర్తృ = కర్తలను, కర్మ = కర్మలను, క్రియలను = ధాతువులను, తెలిసి= తెలిసికొని, నామ...లక్షణంబులు - నామ = ప్రాతిపదికములయొక్కయు (ప్రాతిపదిక మనఁగా విభక్తిప్రత్యయములు గాని, వానికి సంబంధించిన వికారములుగాని కలుగక ముందున్న శబ్దరూపము; రామ, కృష్ణ, మొ.),రూప = విభక్తిరూపములయొక్కయు, అవ్యయ = అవ్యయములయొక్కయు, విలక్షణములన్ = చక్కనిలక్షణములను, (అనఁగా స్వరూపములను), ఆత్మన్ = తనలో, ఎఱిఁగిన కవీశ్వరుండె= తెలిసికొనిన కవీశ్వరుఁడె, కవీశ్వరుండు=కవి యనుటకుఁ దగినవాఁడు

ఈ పద్యమునందు బ్రహ్మవేత్తృపరముగ మఱియొకయర్థము కూడ స్ఫురించు చున్నది:-

టీక, గురు.. ధర్మములు - గురు = ఉత్తమములును, లఘు = అధమము లైన, వర్ణ = జాతులయొక్క, ధర్మములు = ఆచారనియమములను, నియమములు = యోగాంగము లగుశౌచము, తపస్సు మొదలగువానిని (నియమము లనుటచే యోగము సమగ్రమముగ అని అర్థము. కేవలము నియమములనిమాత్రమె తెలిసికొనినందున నంతప్రయోజనము లేదుగదా.), కలిత కర్తృ కర్మ క్రియలను - కలిత = ఒప్పుచున్నట్టి (అనఁగా : ప్రసిద్ధములైన), కర్తృ= చేయువాఁడు, కర్మ= చేయఁబడునది, క్రియ= చేయుట అను వానిని (వీనియథార్థస్వరూపము ననుట. ఇచ్చట ' క్రియ' అనఁగా ఫల మని కొందఱు. అది విచారింపవలసియున్నది.), తెలిసి, నామరూపా ...ముల - నామరూప = నామరూపములయొక్కయు (అనఁగా : నామరూపాత్మక మగు నీ ప్రపంచముయొక్కయు) అవ్యయ = ఈనామరూపములవలన వికారముఁ జెందని పరబ్రహ్మముయొక్కయు, విలక్షణముల్ = చక్కనిలక్షణములను, ఆత్మన్ = తనలో, ఎఱిఁగిన కవీశ్వరుండు= తెలిసినపండితోత్తముఁడె (ప్రపంచము మిథ్య యగుటచేత అది సర్వకాలములయందును గనఁబడుచునే యుండును గావునను, పరబ్రహ్మము తనకంటే వేఱైనవాఁడు గావున నచ్చటఁ జేయవలసినకార్య మేదియును లేకపోవుటచేతను,