పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



క. ఇలలోఁ దండ్రి బలంబును
జలమును మెఱయించుకొని ప్రశాంతుఁ డనంగా
వెలయుచు నతఁడొక కొలఁదిని
జెలువందెను మడుఁగు పట్టు చెలమయుఁ బోలెన్. 168

చ. అనువుగ మంత్రు లాతని మహాసనసంస్థితుఁ జేయఁబూనినం
గని యశరీరి యీపడుచుఁ గార్యము లేటికి వీఁడు దీని నె
క్కిన నగుబాటు గాదె తలఁగించి మహీస్థలిఁ బాఁతి పుచ్చుఁ డా
యనిన నమాత్యులెల్ల వెఱఁగందుచు నమ్మణిభద్రపీఠమున్. 169

ఆ. పుణ్యభూమిఁ బాఁతి పుట్టగాఁ గట్టించి
కొంతకాల మున్న యంతలోన
దైవవశము కొలఁదిఁ దద్దేశ మెల్లను
హానిఁ బొందుచుఖిల మయ్యె[1] మిగుల. 170

సీ. అచ్చోట నొకవిప్రుఁ డగిసెలు లంకలు
గోధుమల్ జొన్నలుఁ గోరి విత్తి[2]
పిట్టలఁ ద్రోల[3] నాపుట్ట పట్టున మంచె
గావించి యది యెక్కి త్రోవవారి
నాచేనుఁ జొచ్చి తిన్నన్ని జొన్నలు గోదు
మలు పిసికిళ్ళుగ నలఁచి తినుఁడు
అని పిల్వ నమ్మి వచ్చిన వారి కవి వెట్టఁ
దా దిగి వచ్చి యందఱ నదల్చి
గీ. పరుల సొమ్ముల కిట్లాస పడఁగఁ దగునె
యనుచు వారల వెడలంగ నడిచి తిరుగ

  1. హానిఁ బొందుచు లయమయ్యె. (మయిలమయ్యె -చిన్నయసూరిపాఠము)
  2. పెట్టి
  3. నార్ప