పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

450

సింహాసన ద్వాత్రింశిక


నింతధనంబు గొని చనియె ననిన మిక్కిలి సంతసిల్లి నవ్వుచు నాలెంకకు లక్షధనంబు పసదనం బొసంగెఁ గావున.

109


క.

నీకంత యీవి గలుగక
యీకడ నడు గిడ దరంబె యేగు మనిన నా
భూకాంతునిగుణము లుప
శ్లోకించుచు నృపుఁడు మగిడి లోనికిఁ జనియెన్.

110


ముప్పదియవ బొమ్మకథ

వ.

మఱియు నొక్కశుభావసరంబున.

111


క.

నెఱయ మగతనము గలిగియు
నొఱపుగ జగములకు దల్లియం దండ్రియునా
నెఱుకపడనొప్పుమేనను
దెఱవయు మగవాఁడునైన దేవరఁ దలఁతున్.

112


మ.

అనుచు న్భోజనరేశ్వరుండు మఱియు న్యత్నంబున న్రత్నకీ
లనరమ్యం దిగు నమ్మహాసనముపై లక్ష్మీకళాసుందరా
ననుఁడై పాదసరోరుహం బిడునెడ న్వారించి యాపొంతకాం
చనపాంచాలిక యిట్లను న్సరసవాచాలత్వ మేపారఁగన్.

113


ఉ.

భోజనరేశ్వరా మగిడి పోయెద వెప్పటి యట్ల క్రమ్మఱన్
రాజసవృత్తి నెక్క ననురాగము గైకొని వచ్చె దింతటం
దేజము గల్గునే వసుమతిం బ్రతిలేని వదాన్యవృత్తి మా
రా జగు విక్రమార్కు సరిగాక పదం బిడఁ జెల్ల దేరికిన్.

114


క.

అతని వదాన్యత్వము విన
మతిఁ బ్రియ మగునేని వినుము [1]మందారము సం

  1. మందారము సం, తతమును సంతానము దా, నతనికి