పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

417


గామకోపలోభగర్వమత్సరమాహ
ములనె కాని [1]రాజ్యబలముగొనదు.

111


క.

కామక్రోధాదులు ని
స్సీమముగా విడువకున్నఁ జేటగు నొకచో
నే మునినై యుండఁగ మఱి
నామీఁదను జోరదండనం బేల యగున్.

112


మ.

ఇది తప్పం జను టొప్పు నంచు నడురే యేకాకియై యేగి భూ
తదయాళుం డనుమౌనిచేత శుభతత్త్వజ్ఞానుఁడై యంబికా
స్పదమధ్యంబునఁ బెక్కునాళ్ళు పవనాభ్యాసంబుతో నుండె ను
న్మదసారంగకురంగసంమపరిగణ్యంబౌ నరణ్యంబులోన్.

113


క.

పోఁడిమి చెడియును దనమది
వాఁడిమి చెడనీక లబ్ధవైరాగ్యుండై
వాఁ డతినియమంబునఁ బదు
[2]మూఁడేఁడులదాఁక ధ్యానమున నుండంగన్.

114


మ.

ఒకనాఁ డేగురుదొంగ లంతికమునం దొప్పారు మందారనా
మకమౌ దుర్గము లీల నేలుచు మహాక్ష్మాపాలుఁడౌ జీవర
క్షకుకన్యాసదనంబు కన్న మిడువాంఛన్ వచ్చి యద్దేవి క
త్యకలంకం బగుభక్తిభావమున సాష్టాంగంబుగా మ్రొక్కుచున్.

115


క.

లోకేశ్వరి నీకృప నీ
క్ష్మాాంతుని కూఁతురగు ప్రకాశినిసొమ్ము
ల్మా కబ్బిన నం దలరెడు
నాకల్పము నీకు నిచ్చి యరిగెదము చుమీ.

116
  1. ములనెకాదు రాజుబలముచనదు
  2. మూఁడేఁడులదనుక. మూఁడేండ్లందాక