పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

418

సింహాసన ద్వాత్రింశిక


క.

అని కానికె మైకొని చన
దిననాథుఁడు గ్రుంకెఁ దమము దిక్కుల నిండెన్
జనులు పనులుడిగి రారెకు
రనువరులై తిరుగఁ జొచ్చి రానగరములోన్.

117


మత్తకోకిల.

గాలిచీరయు నొల్కిబూడిద గ్రద్దగోరును గొంకియుం
గోలయు న్వెలుగార్చుపుర్వులక్రోవి ముండుల బంతియున్
మైలమందుల కొయ్యకత్తెర మాఱుగన్నపుఁగత్తియు
న్నీలిదండులు నల్లపూతయు నేర్పుతోడుగ మ్రుచ్చులున్.

118


క.

చప్పు ళ్ళాలించుచుఁ దమ
చప్పు ళ్ళడఁచుచును జొచ్చి సందులలోనం
జొప్పెఱుఁగకుండ [1]నేగుచు
ఱెప్పలుమాటైన డాఁగురింపుచుఁ బురిలోన్.

119


ఆ.

ఉలుకు మ్రగ్గునంత నొకచోట మొద్దుల
యట్ల మెదలకుండి [2]యన్నకరువు
కొదవియంతనంత గొదుగుచు లోపలి
మెలఁకు వరసి [3]కోటమలుకదాఁటి.

120


ఆ.

పాలె మున్న వారిపై నొల్కిబూడిద
మందు చల్లి పెద్ద మగులు కొంత
కూలఁ ద్రవ్వి రాచకూఁతు రుండెడిమేడ
కత్తిరించినట్లు గంటువెట్టి.

121


క.

తొడిదొడిఁ గ్రోవులపుర్వుల
విడిచి దివియ లార్చి గంటి వెలుఁ గాలోనం

  1. నీగుచు
  2. యన్నకదవుకోదివి-యంతలేచి
  3. కోటచలుకదాటి