పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

సింహాసన ద్వాత్రింశిక


సీ.

చెప్పిన దీన నే సిద్ధియౌ నట్లయ్యు
        నడిగిన నాకిది యడఁపనేల
మేటి జూదరి యన వాటమౌ తివుటమై
        నాడుచుండుదు నే నహర్నిశంబు
దృష్టియేమఱక [1]నందియు జోగరంబును
        దిగయును గాళనాఁ దేటపడిన
యచ్చులలోన నే యచ్చైనఁ గైకొని
        మాటలాడిన యట్ల వేటుగలుగఁ


ఆ.

దలఁపుగతి వచ్చుఁగోరినదాయ మనఁగ[2]
శకునిజూదము వీనియచ్చొకటి యనఁగ
గెలుపునాదిగ నొడ్డుచు గిలుబనేర్చి
యెల్లపిడికిళ్ళు విడిపించి యేనకొందు.

87


ఆ.

ధనము గలుగఁ జూచి తమకంబు పుట్టించి
మొదల గెల్వనిచ్చి పిదప గెలిచి
నలువు రౌననంగ బలవంతు నైనను
నిలువనాఁగికొందు[3] నిమిషమునను.

88


క.

చతురంగంబున నే నతి
చతురుఁడఁ గరితురగమంత్రిశకటకటప్ర
[4]స్థితి పరహస్తము సేయుదు
క్షితి మెచ్చఁగ రాజు బంటుచేఁ గట్టింతున్.

89
  1. సందియు జాగరంబును దిగయునుగరయునా-నంటయు జాగరంబును
    దీగయుగరము నైదింటబడిన
  2. దాయమేసి
  3. నాచికొందు
  4. స్థితవరహస్తము