పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

411


తిలకంబు కస్తూరిఁ దీర్చి జాదులఁ గలి
        గొట్టులఁ బొడవుగాఁ గొప్పువెట్టి
కందుదుప్పటి గప్పి యందియ డాకాలఁ
        గీలించి పువ్వులకోల వట్టి
నిద్దమౌ కుచ్చుల [1]యుద్దాలు కిఱ్ఱని
        మ్రోయఁగా నుల్లాసమునఁ జెలంగి


ఆ.

నలుపు రేవురు సంగడీ లెలమితోడఁ
బోఁకలాకులు [2]నోటిలోఁ బోసికొనుచు
జాణతనమున నట్టహాసములు నొలయఁ
బెచ్చు రేగుచుఁ గొలువఁగా వచ్చె నొకఁడు.

83


క.

వచ్చి గుడి సొచ్చి యందఱు
దిచ్చులు తనతిం కొఱకు [3]దీపులువెట్టన్
మెచ్చుచు వేడుకయాటల
నచ్చోటం బ్రొద్దువుచ్చి యల్లన మగిడెన్.

84


క.

మఱునాఁడు పెదవు లెండఁగ
నెఱి చెడి వదనంబు వాడ [4]నిస్సత్వముతో
చిఱుగోఁచి గట్టుకొని క్ర
మ్మఱ వచ్చెన్వాఁడు దుఃఖమలినాకృతియై.

85


ఆ.

వచ్చి వెచ్చనూర్చి యచ్చోటఁ గూర్చున్న
వానిఁ జూచి మనుజవల్లభుండు
నీవు నిన్న రమ్య మౌవేషమున వచ్చి
నేఁడి టేల వచ్చినాఁడ వనిన.

86
  1. ఉద్దాలు = చెప్పులు. ఉద్దాలుఁ మ్రోయఁగా నుల్లాసమున జొక్కి యొయ్య జేరి
  2. నొడిలోనఁ బోసికొనుచు
  3. దీపులువుట్టన్
  4. నీచత్వముతో