పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

408

సింహాసన ద్వాత్రింశిక


చ.

అని పలుకంగఁ దావిని మహాసనసంస్థితుఁ డైన పాకశా
సనుఁ డతివిస్మయంబుఁ గడుసంతసముం బొడమంగ సమ్ముఖం
బున నిలుచున్న నన్నుఁ గని పూని ధరిత్రికిఁ బొమ్ము విక్రమా
ర్కునిసుగుణమ్ము లేర్పఱుచురూపము గైకొనుమంచుఁ బంచినన్.

66


ఉ.

నే నిట వచ్చి యిచ్చటికి నీవును రాఁగల వంచు దుర్బలం
బైన గవాకృతి న్నిలుచునంతట వచ్చితి వింద్రుమాయ న
వ్వానయు గాలియుం గలిగె వ్యాఘ్రము పైఁబడుటయ్యె నన్నియు
[1]న్మానవనాథ యిన్నిటికి మానుగ నోర్చితి గాన మెచ్చితిన్.

67


ఉ.

నావుడు సమ్మదం బతిఘనంబుగఁ బొంగి యవంతినాథుఁ డో
దేవి భవద్విలోకనము దివ్యపదస్థితికారణంబు నా
దైవము గల్గెఁ జాలు వివిధంబగుసంపద నీశుభానుకం
పావిభవంబునం గలదు భవ్యుఁడ నైతి నటంచు మ్రొక్కినన్.

68


శా.

క్షోణీనాయక నేఁటి మెచ్చునకు నీ సొమ్మైతిఁ గైకొమ్ము గీ
ర్వాణాధీశుఁడుఁ బొందలేని శుభము ల్ప్రాపించు నీకంచు న
క్షీణోల్లాసముతోడ వచ్చు సురభిం జేపట్టి దీనాతుర
త్రాణసక్తుఁ డతండు క్రమ్మఱి మహోత్సాహంబుతో వచ్చుచున్.

69


ఉ.

అంపెలు గట్టి చేత నొకయష్టి ధరించుచు నెత్తివెండ్రుక
ల్చెంపల వ్రేలఁగా ముదిమి జీప నరంబులు తక్కి స్రుక్కి యా
కంపిత మైనవక్ష మనుకంపకు హేతువు గాఁగఁ బ్రార్థనా
లంపటుఁ డయ్యు మేనికి బలం బొడఁగూడమిఁ గుందువిప్రునిన్.

70


చ.

కనుఁగొని యేల కుందెదవు కారణ మే మిది చెప్పు మన్న నో
యనఘ మహాదరిద్రుఁడ ననల్పకుటుంబికుఁడ న్వినష్టజీ

  1. న్మానవనాథ సైచి యభిమానము దాల్చితి గాన