పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

378


నచలంబౌ మతి మూఁడురాత్రులు నిరాహారవ్రతుం డైనచో
నుచితస్వప్నమునందు దేవి వలికెన్ యోగప్రసన్నాత్మ యై.

33


చ.

కల యిది నిక్కువం బనుచుఁ గైకొని ముప్పది రెండులక్షణం
బులఁ జెలువారునట్టి నరపుంగవుకుత్తుక నెత్తు రిచ్చి ది
గ్బలి యొనరించినన్ ద్రవిణకారణమౌ రససిద్ధి చేకుఱు
న్వలవదు నీకు నీయనశనవ్రతఖేదము మేదినీశ్వరా.

34


చ.

అనవుడు మేలుకాంచి కడు నద్భుత మందుచు విక్రమార్కుఁ డా
గొనములవాని నింక సమకూర్పఁగ నొండెడ కేగనేల నా
కని మతిఁ దానె సర్వసుగుణాఢ్యుఁడు గావునఁ దెంపుత్రోడఁ గ్ర
క్కున నడిదంబు డుస్సి తనకుత్తుక నొత్తె[1] నుదాత్తచిత్తుఁడై.

35


క.

ఒత్తఁగఁ బ్రసన్నమతి యై
యత్తఱి నడిదంబు వట్టి యాదేవత లో
కోత్తమ నీతెంపున నా
చిత్తం బిగురొత్తె నిష్టసిద్ధి యొనర్తున్.

36


క.

అడుగుమ యనవుడు మది నా
యెడఁ గడుఁ గరుణించితేని నీవిప్రుఁడు దా
నిడుమలఁ బడి పొరలెడిఁ గృప
యెడపక రససిద్ది యితని కిమ్మని మ్రొక్కెన్.

37


ఉ.

మ్రొక్కిన నద్భుతంబును బ్రమోదము నొందుచు యోగమాత దా
నక్కఱ దీర్చునట్టి రస మాతని కిచ్చి యవంతినాయకున్
మిక్కిలి యింపునం బరిణమించి యదృశ్యత నొందె విప్రుఁ డిం
పెక్కి తదీయవర్తన మనేక విధంబులఁ బ్రస్తుతింపఁగన్.

38
  1. నొత్తెడు నంతలోపల