పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

372

సింహాసన ద్వాత్రింశిక


క.

వికటం బగుదారిద్ర్యము
నకుఁ గడపల లేక జీవనము బహుళకుటుం
బకుఁడం గావున జరగక
యొకచో రససిద్ది వడయ నూహించి మదిన్.

28


మ.

అలసత్వంబునఁ బ్రొద్దుపుచ్చక నిరాహారుండనై కంచిలో
పలఁ గామాక్షి గుఱించి యుగ్రతప మేఁ బండ్రెండుసంవత్సరం
బులు సేయంగఁ బ్రసన్న గామి పిదపన్ భూపాల నాయాత్మలోఁ
గలఁగంబాఱుచు దేవి దూఱుచును భిక్షావృత్తిమై[1] వచ్చితిన్.

29


ఉ.

నాకు మహాదరిద్రున కనాథునకు న్భువిఁ ద్రిమ్మరం దగుం
గాక ధనంబు రాజ్యమును గల్గఁగ జోగిక్రియం జరింపఁగా
లోకులు నవ్వరే నృపులలో నినుఁ బోలెడు నట్టివాని నే
నేకడఁ గానఁ జాలు నిఁక నేగుము నీపురికి న్సుఖింపఁగన్.

30


ఉ.

నావుడు లేచి యెండువచనమ్యులు [2]వోవఁగనిమ్ము కంచిలో
దేవత నీతపంబునకుఁ దేరకొనం గరుణింప దంటి భూ
దేవకులాగ్రగణ్య యరుదెంచి భవత్ప్రియ మాచరింపఁ ద
త్సేవ యొనర్చి యేను రససిద్ధి ప్రసిద్దికి నెక్కఁ గాంచెదన్.

31


మ.

పొద మాదేవత యున్నభూమి కని యాభూదేవునిం గూడి స
మ్మదలీలం జని రత్నహర్మ్యముల రమ్యంబౌచు సొంపారు సం
పదలం బొంపిరివోవుకంచి నయమొప్పం జూచి యచ్చోటఁ జ
క్కదమౌ భావనఁ జేరనేగె నృపుఁ డాకామాక్షి నీక్షింపగన్.

32


మ.

అచటం దీర్థములాడి శంభునకు దైత్యారాతికిన్ మ్రొక్కి పు
ణ్యచరిత్రుం డొకరేయిఁ బుచ్చి మఱునాఁ డారాధనారక్తి మై

  1. భిక్షావృత్తినై
  2. లటుండఁగ నిమ్ము కంచిలో