పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

367


సీ.

అష్టభోగంబుల నైశ్వర్యమునఁ గళ
        జలవైరిఁ బురవైరిఁ బద్మవైరి
నతిశక్తి నిలుకడ వితరణగుణమున
        నహిరాజు నగరాజు[1] నంగరాజు
నాహవోత్సవమున నభిమానమునఁ గీర్తిఁ
        గపికేతు ఫణికేతు గరుడకేతు
దృఢముష్టిఁ జేసూటి దివ్యాస్త్రసామగ్రి
        బలరాము రఘురాముఁ బరశురాముఁ


ఆ.

[2]బావనత్వమున ఘనసంపత్తి దీప్తి
ననిలమిత్రుని హరమిత్రు నబ్జమిత్రుఁ
బోలు నితఁడని జనులెల్లఁ బొగడుచుండ
నవనితల మేలె నావిక్రమార్కవిభుఁడు.

5


ఉ.

వాసవు మీఱి నిత్యవిభవంబునఁ బేదలఁ బ్రోచి వైరిసం
త్రాసవిహీనుఁడౌ నతఁడు రాజ్యము మంత్రుల కప్పగించి ష
డ్మాసముల న్విదేశగమనంబు చలించుచు నుండ నొక్కెడన్
వేసవి వచ్చెఁ బాంథులకు వేసట వుట్టఁగ వెట్ట గొట్టఁగన్[3].

6


ఉ.

ఎండకు లావు గల్గఁగ మహీరుహశాఖల నాకు లెల్లఁ బె
ల్లెండల వేఁగ నెందు జల మింకఁగ సుక్కఁగఁ బద్మషండ ము
ద్దండము గాఁగ లోకులు యథావిధి నీడలు గోరుచుండఁగా
రెండవసూర్యునట్లు ప్రసరించె నిదాఘము తద్గుణంబులన్.

7


క.

విరహులమనముల దినమును
బరితాపం బినుమడింపఁ బరిమళములచే

  1. గిరిరాజు
  2. చాపనైపుణీసంపద సారశక్తి నచ్యుతునిమిత్రు
  3. వెట్ట లంటగన్