పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

362

సింహాసన ద్వాత్రింశిక


[1]నమరవరులైన నీవశిత్వమునఁ జిక్కి
మాఱువల్కరు కైకొమ్ము మమ్ముఁగూడ.

197


వ.

ఈయష్టసిద్ధులకు మేము పరకాయప్రవేశాద్యుపసిద్ధులము. తత్పరిచారికాసహస్రసహితంబుగా నీరాజ్యంబు గైకొని యందఱు నేలుకొ మ్మనిన నతివిస్మితుండై యతండు నయవినయంబుల నిట్లనియె.

198


క.

మీరలు దేవత లన్యులఁ
గోరం దగ దేను దీర్థగుణ మెఱుఁగఁగ నా
నీరంబుల మునిఁగితి మీ
కారుణ్యవిలోకనంబు గలిగినఁ జాలున్[2].

199


క.

అని మ్రొక్కి లేచి చనఁజూ
చిన నాతలఁ పెఱిఁగి యష్టసిద్ధులు నగుఁ గై
కొను మని యెనిమిదిరత్నము
లనిమిషసతు లిచ్చి వెడల ననిపిరి నృపతిన్.

200


మ.

అకలంకుం డగు నమ్మహీవరవరుం డానందసంస్ఫూర్తిచే
వికసన్మానసుఁ డై ప్రసిద్ధవనము ల్వీక్షించుచు న్వింధ్యభూ
మికి గోదావరి దాఁట కాఱడవిఁ బేర్మిం బోవుచో నొక్కవి
ప్రకుమారుం గనియె న్నిరంతరగళద్బాష్పాకులప్రేక్షణున్.

201


చ.

కని యిది యేల యేడ్చెదవు కానలఁ గ్రుమ్మర నేటికన్న నో
మనుజవరేణ్య నాజనని మజ్జనకుం గడు దూఱె దూఱిన
న్మనమునఁ గంది యాతఁ డభిమానముతో వనభూమి కేగె నా
తని నరయంగఁ ద్రిమ్మరుచు దవ్వుగ వచ్చితిఁ గాన నావుడున్.

202
  1. అమరవరు లౌదు రీవశిత్వమునఁ గాన, మాఱువల్కక కైకొమ్ము మమ్ముఁ గూడ
  2. గలిగెం జాలున్