పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

361


క.

ఉఱికి తదభ్యంతరమున
నెఱమంటలు దాటి వెనుక నేతేరఁగ న
త్తెఱఁ గెఱిఁగి నిలిచి ప్రియమున
దెఱవలు చెయివట్టి భూపతిం దోకొనుచున్.

193


ఆ.

రజతసౌధములును రత్నగేహంబులుఁ
గనకమండపములుఁ గలుగుపురము
సొచ్చి వైభవములు సూపుచు మౌక్తికా
సనముమీఁద నతని నునిచి రంత.

194


క.

కనకకలశోదకంబుల
జనపతిచరణములు తొడసి సత్కారము లిం
పునఁ జేసి సఖులు లోచన
వనజంబుల దీపముల నివాళింపంగన్.

195


వ.

అందు నొకసఖీశిరోమణి నృపశిఖామణికి నయ్యెనమండ్రను జూపుచు.

196


సీ.

అవనీంద్ర యష్టమహాసిద్ధు లీరామ
        లాఖ్యానగుణము లిం దమరియుండు
నతిసూక్ష్మరూప మీయణిమచేఁ జేకుఱు
        మహిఁ బెద్దగాత్ర మీమహిమ నొదవు
[1]జలమున మింటను జులక నయ్యెడునట్టి
        లాఘవం బొనరు నీలఘిమచేత
బరు వైనభావ మీగరిమచే నగపడు
        నీప్రాప్తిచే నగు నిష్టగతులు


ఆ.

నెనయు దలఁపు లీప్రాకామ్యమున ఫలించు
మనుపఁ జెఱుప నీయీశత్వమునన కల్గు

  1. జలముల మునుఁగఁగఁ జులక గానయ్యెడు