పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

359


సంతసం బందుచు జననాథు దర్శింప
        జని వాఁడు పోయి వచ్చిన తెఱంగు
చెప్పి మ్రొక్కించిన క్షితిపాలకుండును
        మోదంబుతో వాని నాదరించి


ఆ.

రాజనీతులు మంత్రి కార్యక్రమంబు
లడుగుచును గొంతతడవున కట విదేశ
మేగి చోద్యంబు లచ్చట నేమి గంటి
చెప్పు మనవుడు గ్రహిలుండు చెప్పె నదియు.

183


ఆ.

కడిమి నంధ్రభూమి గౌతమిలో జల
ముడుకుచుండ నుండు నొక్కమడువు
లోననుండి రాత్రి లోలాక్షు[1] లెనమండ్రు
వెడలి వత్తు రచటి మృడుని గొలువ.

184


క.

వచ్చి తమయాటపాటల
నచ్చంద్రాభరణుఁ గొలిచి యరుగుచు నను వా
రచ్చటికిఁ బిలువ నుదకపుఁ
జిచ్చు సొర న్వెఱచి పోక చిక్కితి గుడిలోన్.

185


చ.

అనవుడు వేడ్క వానిఁ గనకాభరణాదుల నాదరించి వీ
డ్కొని నృపుఁ డొక్కఁడు న్వెడలి కొన్నిదినంబుల కంధ్రభూమి కా
ననములు దాఁటి పాపహిమనాశనసార్థము నుష్ణతీర్థముం
గని వెఱ గంది పొంత నుదకంబులఁ గ్రుంకి శివార్చనామతిన్.

186


క.

ఆగుడికిం జని హరు నను
రాగంబునఁ గొలుచు నంత రవి గ్రుంకె నను

  1. మీనాక్షు