పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

సింహాసన ద్వాత్రింశిక


చ.

అట చని గంగలో జలకమాడుచుఁ గొందఱచే నెఱింగి మి
క్కుటముగ నింపుతో యముని కుండము దూఱి కడంక బ్రహ్మ[1]కూఁ
కటియును ముట్టి వెల్వడి జగత్పతి యౌ నరసింహమూర్తి ముం
దటి కరుదెంచి మ్రొక్కి యుచితంబుగఁ బూజ యొనర్చి భక్తితోన్.

178


ఉ.

నర్మద తుంగభద యమునానది జాహ్నవి కృష్ణ గౌతమిం
గర్మము వాయ నెన్ని జలకంబులు దీర్చితినో దయామతీ
ధర్మము లెన్ని చేసితినొ దానము లెన్ని యొనర్చినాఁడనో
ధర్మపురీనృసింహ నిజదైవమనోవిభు నిన్నుఁ జూచితిన్.

179


వ.

అనుచుఁ బునఃపునఃప్రణతుండై వెడలి తదాసన్నం బగు దేవాలయంబునకుం జనుచు నద్దేవు నుద్దేశించి.

180


ఉ.

శాశ్వత మౌకృపారసముచాడ్పున ముందఱ గంగ వాఱఁగా
విశ్వజనీనవృత్తిఁ బృథివిం దగురూపున నిల్చి సంతతా
నశ్వరభుక్తిముక్తిసదనం బగు ధర్మపురీశుఁ డైన గా
మేశ్వరుఁ డెల్లకాలమును నీవుత మాకు నభీష్టసంపదల్.

181


చ.

అని గుడి సొచ్చి యీశ్వరున కర్చన లెల్ల నొనర్చి మ్రొక్కి యిం
పున మగుడం గడంగి భువి బుణ్యపదంబులు చూచుచుం గ్రమం
బున నొకయేఁడు వుచ్చి తలఁపు ల్సమకూడిన నిర్వికారుఁడై
జనకునిఁ జూడవచ్చె నయశాస్త్రవిశారదుఁ డయ్యవంతికిన్.

182


సీ.

వచ్చి తండ్రికి గౌరవము దోఁప మ్రొక్కుచుఁ
        బ్రియవాక్యములఁ గడునయము సూప
బుద్ధిసింధువుఁ దనపుత్రుఁ గౌఁగిటఁ జేర్చి
        న న్నుద్ధరించితే యన్న యనుచు

  1. కూకటియను వేల్పు గొల్చుచు