పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

సింహాసన ద్వాత్రింశిక


న్నాహము సేయుచో నొకతె నాదవిశోధన[1] చేయుచుండె నాఁ
గాహళ వట్టె గానగమకశ్రుతితానవిధాన మానఁగన్.

167


ఆ.

గానభిక్ష వేఁడ హీనస్వరంబున
వదరుకాయ లంది వచ్చినట్టి
వీణియలకు లయలు విప్పిచెప్పెడు భంగి
నందు ముగురు పాడి రందముగను.

168


క.

[2]సూళాదిగీతములును సు
తాళము ధ్రువ గురువు లఘుయుతంబులుఁ దమలో
మేళనమునఁ జెడకుండఁగఁ
దాళము వాయించె నొకతె తద్గతికొలఁదిన్.

169


ఆ.

గళరవంబు లమర గమకంబుతోఁ బేర్చు
రాగమున మనంబు రంజిలంగఁ
బ్రియుఁడు వోలె నధరబింబంబు చుంబించు
వాసెగ్రోలు వట్టె వనితయోర్తు.

170


ఆ.

మూఢునైన బట్టి ముఖరునిఁ జేయుదు
ననినభంగి సతి మృదంగ మంది
కంకణములు తాళగతి మ్రోయ వాయించెఁ
[3]దొయ్యలులకు నెద్ది దుష్కరంబు.

171


చ.

తతఘనమర్దళాదినినదంబులు నర్వదినాల్గు హస్తని
ర్గతులును దృగ్విలాసములుఁ గన్నులపండుగ గాఁగఁ దాళసం

  1. నాదవినోదము
  2. సాళాదిగీత
  3. దొయ్యలులకు వేడ్క తొంగలింప