పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

సింహాసన ద్వాత్రింశిక


య్యన నాదిక్కున కేగుచున్ హృదయభృంగాఖ్యన్జగత్పూతమై[1]
న నగం బల్లన దాఁటి తీర్థసలిలస్నానార్థియై ముందఱన్.

145


మహాస్రగ్ధర.

కనియెం గ్రీడద్విహంగన్ ఘనజలరవజాగ్రద్భుజంగన్మహాపూ
రనిరూడవ్యూఢదుర్వారభృతరుచితటీరంగభంగత్తరంగన్[2]
జనితశ్రేయానుషంగన్ జలధిహితపరిష్వంగనార్ద్రాంతరంగన్
జననిర్ధూతాభిషంగన్ క్షతగిరికటకోత్సంగఁ బాతాళగంగన్.

146


వ.

కని యందుఁ గల దక్షిణావర్తంబునఁ గృతస్నానుండై మల్లికాకుండంబును, ఘటికేశ్వరంబును, భ్రమరికాశ్రయంబును, గాలహ్రదంబును, దేవహ్రదంబును, సంధ్యామౌనంబును, జారుకేశ్వరంబును, నందిమండలంబును మున్నుగాఁ ద్రింశద్యోజనాయతంబును ద్రింశద్యోజనవిస్తీర్ణంబును నగుటం జేసి బహుకోటితీర్థమయంబు నగు నారమాక్షమాధరంబుమీఁదికిం జని కనకమయప్రాసాదంబు సొత్తెంచి.

147


క.

ఆర్జవమున నచ్చటఁ బూ
ర్వార్జిత మగు పుణ్యసముదయమునం గనియె
న్నిర్జరగణసంసేవితు
నర్జునకిరణాంకు మల్లికార్జునదేవున్.

148


వ.

కని సాష్టాంగం బెరంగి.

149


క.

గోపతివాహనునకు నల
కాపతిమిత్రునకుఁ ద్రిపురఖండనసమయా
రోపితగిరిచాపునకును
శ్రీపర్వతవిభున కార్తచింతామణికిన్.

150
  1. హృదయభంగాఖ్యన్ జగత్ఖ్యాతమై
  2. రంగదుత్కూలరంగన్ -రంగనృత్యత్కురంగన్