పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

351


వ.

అ ట్లేగుచు నొక్కనాఁడు [1]భువనగిరియొద్ద నొక్కయగ్రహారంబు డగ్గఱి యందుఁ గొందఱు సభ్యులు పురాణశ్రవణంబు సేయుడున్న నట తానును జేరి వినునెడ నప్పౌరాణికుండు తీర్థఫలంబు లెఱింగించుచు.

140


ఆ.

ఏకభుక్తములు ననేకదానములు న
యాచితములు జపము లనశనములు
[2]జరపి వెచ్చుకంటె సరగునఁ గాశిలో
బొంది విడిచి ముక్తిఁ బొందవచ్చు.

141


క.

మెట్టక పెట్టక పట్టక
గిట్టక తీర్థముల ముక్తికిం జనరా దే
తొట్టును బొరయక మెయిమెయి
కట్టెదురన్ శ్రీనగంబు గనినం జాలున్.

142


క.

తనువు దొఱంగక యిది యె
క్కనలవి గాదంచు శివుఁడు గైలాసము గ్ర
క్కన విడిచి బొందితో( జనఁ
దనభక్తులకొఱుకు నందుఁ దరలక యుండున్.

143


క.

శిలలెల్లను లింగంబులు
సలిలంబులు దివ్యసింధుసారంబులు తీఁ
గలు సంజీవను లౌ ద్రుమ
ములు మందారములు చఱులు ముక్తిపదంబుల్.

144


మ.

అని చెప్ప న్విని చిత్తకల్మషము వాయంజేయ శ్రీపర్వతం
బునకే పోవుట మే లటంచు నతఁడా పుణ్యాత్ములం బాసి చ

  1. శ్రీమహాజననంబున నొక్కయగ్రహారంబు, మహాఘనగిరియొద్ద గొందఱుసభ్యులు
  2. జరపి చచ్చు కంటె