పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

343


బెల్ల సమకూర్చి దాఁచిన
యిల్లనఁ దగు సర్పవనము నెదురం గనియెన్.

97


సీ.

కన్నుల మిణుఁగుఱుల్ గ్రమ్మంగ మ్రొగ్గుచు
        బుస్సనుచో వేఁడిపొగలు నిగుడఁ
బ్రల్లఁదంబున మళ్ళు నల్లనాగులు నాగ
        పెంజెరలును బెంటిపెంజెరలును
శంఖపాలకులును జాతినాగులు నుర్లుఁ
        బెంజెరలును నెఱ్ఱబెంజెరలును
గూఁకవేటులుఁ జిల్ముగులియలుఁ ద్రాఁచులుఁ
        బెరజులు గుఱ్ఱపుబెరజు లచటఁ


ఆ.

గలవు తక్కినజెఱ్ఱిపోతులును దుంప
నాగులును గొంటిగాఁడులు నరియకొక్కు
లేనవాలము ల్జెడుగులు? నిరుమొగముల
పాములును బెక్కు తద్వనభూమి నుండు.

98


క.

ఇవ్విధమున ఘోరంబగు
నవ్విపినాంతంబు సొచ్చి యరుగఁగఁ బాముల్
క్రొవ్వున మ్రోగుచు నాతని
నెవ్వెంటలం దామె యగుచు [1]నెగురుచుఁ బట్టెన్.

99


గీ.

పట్టి వరుణనాగపాశంబు లట్లు మై
జుట్టుకొనిన నతఁడు పట్టువడక
యట్టివేళ జలగ లంటినకరి వోలె
దిట్టతనము మెఱిసి తిరుగఁ డయ్యె.

100
  1. నెగడుచు