పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

మనసుదేఱఁజూచియును జూడకున్నట్లు
దృఢముగాఁగఁ జోరదృష్టి నడఁగి
జంకిమీఁద నొడిసి శార్దూలదృష్టిఁ బై
బడుట సురియకాండ్ర పంతమిదియ.

62


క.

తొమ్మిదిదృష్టులలో నా
యిమ్మగు పులిదృష్టిఁ జొచ్చి యెదుఱొమ్ము కఠా
రమ్మున నది తొలుపోటుగ
గ్రుమ్మెద నేనొండు లేక కుంభినిఁ గూలన్.

63


వ.

అనుడు వింతపంతంబుల కచ్చెరు వంది పొందుగాఁ జూచి విడువుం డన భట్టియు నంగాధీశ్వరుండును నిలువంబడి విస్తారంబు గలుగ వైహాళి దీర్చి యెల్లజనులం గూర్చుండనిడి గలబపుట్టకుండ నెడ నెడం దలవరుల నిలిపి పట్టెడువారల మాటమాటలలోనఁ బట్టుం డని నియమించి నలువురుబంట్లనడుమనిడి కఠారంబు లొక్కకొలందిగాఁ గొలిచి నిమ్మపండ్ల దొడసి యెడగలుగ బంట్లచేతి కిచ్చినం బమ్ముకొని యవ్వీరులు చూచువారిచూపుగముల కెల్లఁ దార లక్ష్యంబు లగుచు ధీరధీరంబుగఁ జొచ్చి.

64


క.

మ్రింగెడు కృష్ణోరగముల
భంగి న్బెబ్బులులక్రియ నిభంబులకరణిన్
సింగములభాతి నలవడు
సంగతితోఁ గదిసి రెల్లజనులుం బొగడన్.

65


వ.

కదియుచుం గలహకంటకుండు తెలిసి పొడువు మోయన్న యని తెలుపుచు ఘాత గొనంగ నోహో చాలుం బట్టుం డని యిద్దఱం బట్టించి భట్టి నృపునిదగ్గఱం దెచ్చి వీరిజగడంబులు సంతసపడియె[1] ననిన.

66
  1. వీరి జగడంబులంతరపడియె