పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

289


పురుషవర్జిత మైన పురము గనుంగొని
        యట నొక్కదేవాలయంబుఁ జేరి
దానిచేరువ నుక్కునూనెకొప్పెరపొంత
        విపులమౌ కనకమండపముక్రింద
మోహనం బైన వివాహవేదికమీఁది
        [1]రత్నపట్టికలోని వ్రాఁత చూచి


ఆ.

నరుఁడు తైలకటాహంబు నడుమఁబడిన
నెఱయఁ గందర్పసంజీవినీసమాఖ్య
నమరుకన్యయు రాజ్యంబు నతనిసొమ్ము
లనుచు నేర్పడియున్న పద్యంబు చదివి.

126


వ.

దానికి విస్మయభయసంశయాన్వితుండై.

127


క.

ఈయుడుకునూనె డగ్గఱఁ
బోయినఁ దాఁ జచ్చుఁబో యీవిభవం
బేయనుభవమున కగు నని
డాయక మది నులుకు మిక్కుటంబై మగిడెన్.

128


క.

ఉజ్జయిని కరుగుదెంచి సు
హృజ్జనములఁ గూడి వార లెల్లం బ్రీతిం
బజ్జం జనుదేరంజని
యజ్ఞనవల్లభుని నుతుల నభినందించెన్.

129


క.

ఆవిక్రమార్కుఁ డతిసం
భావనమైఁ గుళల మడిగి పరభూముల నీ

  1. పసిండిఘంటికలోని