పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

245


వ.

కావున నన్ను మన్నించెదవేని నీతెంపు మాని మరలు మని పునఃపునః ప్రణామంబు లాచరించి యాతని వేఁడికొని తల్లిని జూచి యోయమ్మ నెమ్మనంబున బమ్మరింపకుము నాకెన్ని జన్మంబులైన నీవ జననివి గమ్మని మొక్కి వీడుకొని దేవతాప్రణామోన్ముఖుం డై చని యాపొంత.

214


క.

గోకర్ణరాజకంకణు
గోకర్ణనివాసుఁ జాపగుణగోకర్ణున్
గోకర్ణశాయిమిత్రుని
గోకర్ణేశ్వరునిఁ జూచుకోరిక నేఁగెన్.

215


సీ.

అట ఖేచరాత్మజుఁ డార్తునిఁ గాచుట
        చేకూరు టెట్లని చింతనొంది
యర్ణవతీరగోకర్ణంబునకు వాఁడు
        చని వచ్చునంతకుం జనఁ దలంచి
యత్తవారిచ్చిన యరుణాంశుకంబులు
        వధ్యచిహ్నమునకు వలను గాఁగఁ
బులకించి చని వధ్యశిలయెక్కి మదిఁ జొక్కి[1]
        గారుడాగమనంబుఁ గోరుచుండి


ఆ.

తల్లి కనకవతియుఁ దండ్రి ఖేచరపతి
కాంత మలయవతియె గాఁగ నాకు
నీపరోపకార మెల్లజన్మంబులఁ
గలుగ వలయుననుచుఁ దలఁచునపుడు.

216


మ.

గిరు లల్లాడఁగ నర్కుతేరు దొలఁగం గీర్ణంబులై మింటిపైఁ
దరువుల్ గ్రద్దలభంగి నాడఁగ సముద్రం బెల్ల ఘూర్ణిల్లఁగాఁ

  1. వడిఁ బొంగి