పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

241


మూల మయ్యె దాన నేలికతన మెద్ది
యేది పెద్దతన మదేటితగవు[1].

193


క.

అకటా నాగేంద్రుఁడు స్రు
క్కక జిహ్వలు రెండువేలు గలుగఁగ నొకనా
లుకనైనఁ దన్నుఁ దీని స
ర్పకులము రక్షింపు మనుచుఁ బలుకం దగదే.

194


సీ.

అని కరుణాకరుండై యేఁగుచో నొక్క
        వృద్ధకామిని పుత్రువెనుకఁ దగిలి
హా శంఖచూడ వంశధార యోయన్న
        నీచిన్నిమో మెందుఁ జూచుదాన
పక్షినాయకుబారిఁ బడఁద్రోచి యే నెట్లు
        నిలుతుఁ బ్రాణంబుతో నీవు సనఁగ
బంధువు లందఱుఁ బగఱ కొప్పించిరి
        యింకిట నీకు దిక్కెవ్వ రయ్య


ఆ.

యనుచుఁ బలవరింపఁ గనుఁగొని యది దాని
జననిఁగా నెఱింగి మనుపఁబూని
వీనిఁ గాచువాఁడ వెఱవకు మోయమ్మ
యనిన గరుఁడుఁ డనుచు నబల బెగడి.

195


క.

పైచీరఁ గొడుకుఁ గప్పినఁ
జూచి యతం డేను వినతసుతుఁడం గా నే
ఖేచరకులజుఁడ నీసుతుఁ
గాచెద బెగ డుడుగు నన్ను గరుడని కిత్తున్.

196
  1. బ్రదుకు