పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

సింహాసన ద్వాత్రింశిక


వ.

అనిన బెగ డుడిగి యప్పడఁతి యిమ్మాట యింక నొకమాటాడుఁ డనిన నతండు నవ్వి.

197


క.

నేలయు నుదకముఁ దేజము
గాలియు నాకసము నెఱుఁగఁ గాచితి నాకై
కోలిదె రెం డాడఁగ నా
నాలుక మీకులమువారి నాలుక లటులే?

198


ఉ.

మేరువు సంచలించిన సమీరుఁడు నిల్చిన భూమి గ్రుంగినం
దారక లెల్ల డుళ్ళిన సుధాకరుఁ డగ్నికణంబు లొల్కిన
న్వారిధు లింకిన న్నభము వ్రాలిన భానుఁడు చల్లనైన నం
భోరుహసూతి దప్పినను బొంకుదునే మునుపాడి క్రమ్మఱన్.

199


ఉ.

నావుడు నాగకాంత కరుణాకర యోఖచరేంద్ర నాసుతుం
గావగఁ బూని వచ్చితివి కన్నతనూజునికంటె నీయెడన్
భావము సార్ద్రమైనయది పన్నగవైరికి నిన్ను నిచ్చి యే
త్రోవల నేఁగుదున్ బ్రదుకుత్రోవ విచారము లేదు నా కిఁకన్.

200


ఆ.

అన్న నీకు నతిచిరాయువు గావుత
మన్న శంఖచూడుఁ డతనిఁ జూచి
కరముఁ జోద్యమంది కరములు మొగిడించి
విన్నఁదనము లేక విన్నవించె.

201


క.

వసుధఁ గొఱగాని కడుఁబా
లసులము పులుకాసిపుర్వులము[1] మాకై నీ
యసువులఁ బగఱకు నొసఁగుట
కసవునకై రత్న మమ్మఁ గడఁగుట గాదే.

202
  1. కుటిలప్రచారులము