పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

235


మధుర మగు నావధూమణి
యధరము చవిచూడఁ గలుగునా యిఁక నాకున్.

160


వ.

అట్టిబోటి కూటమి లేక మదిం గంది కుంది బ్రతుకుకంటెఁ బ్రాణంబులు దొఱంగుట మే లనిన మధుకరుం డోకుమారకంఠీరవ యిఁతలో ధీరత్వంబు విడుతురే నావుడు నభిమానించి.

161


క.

పూచినరసాలభూజముఁ
జూచితిఁ జంద్రాతపమ్ముఁ జొచ్చితి నిన్నన్
నీచేతికదళిదళముల
వీచోపులగాలినుంటి వీరుఁడఁ గానే.

162


వ.

అనునెడం జతురిక డగ్గఱి తనచెలి వల పెఱింగింపం బూని.

163


క.

వీరుఁడవు మేరుభూధర
ధీరుఁడ వత్యంతదానదీక్షాజితమం
దారుఁడవు భూరికరుణో
దారుఁడ వయితేని బాల దయఁ జూడుమిఁకన్.

164


వ.

అని మఱియును.[1]

165


క.

మలయాచలసానువుపై
మలయుచుఁ జనుదేర గౌరిమందిరమున నీ
ర్మలయశుఁడ వైన నిను మా
మలయవతీకన్య చూచె మానముదూలన్.

166


క.

అది మొదలుగ మరునమ్ములఁ
జెదరినదైర్యమున జేయి చెక్కిట నిడి స

  1. ఈక్రిందివి దశావస్థలకందములు.