పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

సింహాసన ద్వాత్రింశిక


ఆ.

నెదుర మదనుచేత హృదయసంతాపంబు
పొదలఁ బువ్వుఁబొదల మెదలఁబూని
సంగడీనిఁ గూడి యంగనఁ దలఁచుచుఁ
బలవరించు నతనిపలుకు వినియె.

154


వ.

అది యెట్లన్నను.

155


ఉ.

మారుని మోహనాస్త్రము, సమస్తవిలాసవిహారభూమి, శృం
గారరసంబుతేట, తొలుకారుమెఱుంగులపుట్టినిల్లు, సం
సారసుఖంబు లేమొలక , చక్కఁదనంబులప్రోక కాఁకబం
గారముచేగ, యాతరుణి కన్నులపండువ గాదె చూచినన్.

156


క.

నెఱిచెడి యింటికిఁ జనునా
తఱి మొగమున కెగయు తేఁటిదాఁటునకై తాఁ
జెఱికడ బెడమఱి చూచినఁ
జుఱుకున నానెఱను నాఁటెఁజూ పెనుదూపై[1].

157


వ.

తన్మూలంబుగా మన్మథుండు బాణవిరహితుండయ్యె నని తదనంతరంబ.[2]

158


క.

మదనుని యేనమ్ములు నా
హృదయాగ్నిని భస్మమయ్యె నిదిమొదలుగ నీ
పదునాలుగులోకములును
బ్రదుకుఁ గదా వీనిచేతిబాధకు వెలి యై.

159


క.

మధుకర తన్ముఖపంకజ
మధుకరభావమున మిగుల మత్తిల్లి సుధా

  1. నె, నరునాటంజూపె మన్ననంజడమాటై. చిఱికునఁ బెడమరిచూచిన నెఱసఖిఁజేరిననాగనె
  2. తన్మూలంబుగాఁ బెడమఱిమాచిన మన్మథుండు తెగఁజూచుట లోకోపకారంబయ్యె.